Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ నామినేషన్‌

- Advertisement -

ప్రధాని మోడీ, కేంద్రమంత్రుల సమక్షంలో పత్రాలు అందజేత
నేడు ఇండియా బ్లాక్‌ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అధికార ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు. తొలి సెట్‌కు చీఫ్‌ ప్రపోజర్‌గా ప్రధాని మోడీ సంతకం చేశారు. నామినేషన్‌ పత్రాల దాఖలుకు ముందు సిపి రాధాకృష్ణన్‌ ప్రేరణా స్థల్‌ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నామినేషన్‌ పత్రాల దాఖలు అనంతరం రాధాకృష్ణన్‌ విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్‌ పత్రాల దాఖలుకు మంత్రులు, ఎన్డీఏ నేతలతో కలిసి వెళ్లామని, ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్‌ వన్నెతెస్తారని, దేశం మరింత ప్రగతి పథంలోకి వెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కిరణ్‌ రిజిజు, రామ్మోహన్‌ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు (టీడీపీ), లలన్‌ సింగ్‌ (జేడీయూ), చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్జేపీ), అనుప్రియ పటేల్‌ (అప్నాదళ్‌), తంబిదొరై (అన్నాడీఎంకే), రాందాస్‌ అథవలే (ఆర్పీఐ), కుమారస్వామి (జేడీఎస్‌), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్సీపీ-అజిత్‌ పవర్‌), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డీ), శ్రీకాంత్‌ షిండే (శివసేన-శిండే) తదితరులు పాల్గొన్నారు.
నేడు ఇండియా బ్లాక్‌ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌
నేడు (గురువారం) ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా సెప్టెంబర్‌ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ప్రక్రియతో ఎన్నిక నిర్వహిస్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad