సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ ఎండి ఫయాజ్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
బీసీలకు 42 శాతం బిల్లు ఆమోదానికి అడ్డుకట్ట చేస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర బందుకు సిపిఐ సంపూర్ణ మద్దతిస్తుందని సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ ఎండి ఫయాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభాలో 50 శాతానికి పై పడ్డ బీసీలకు సమ న్యాయం జరిగేందుకు ప్రవేశపెట్టిన బీసీ బిల్లును రాజకీయ పక్షాలు ఒకపక్క అనుకూలమని ఆమోదిస్తూనే మరోపక్క దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతుగా మాట్లాడిన బిజెపి శాసనసభ పక్షం రాష్ట్ర నాయకులు అది కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళగానే మాట మార్చి బిల్లును అడ్డుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఏ పార్టీ అయినా మీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినప్పుడు దానికి తగ్గ ఏర్పాటు కూడా చేసుకోవాల్సిన అవసరం బిల్లు తెచ్చిన ప్రభుత్వం పై ఉందని ఆయన తెలిపారు. కారణాలు ఏదైనా కారకులు ఎవరైనా బీసీలకు మాత్రం మరో మారు అన్యాయం జరగడానికి వీల్లేదని 42% రిజర్వేషన్ బిల్లు సాధనకై జరిగే ప్రతి ఉద్యమంలో సిపిఐ ముందు భాగంలో ఉంటుందని తెలిపారుతెలిపారు. 18న జరిగే రాష్ట్ర బందులో జిల్లా వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని బీసీ సంఘాల జేఏసీ ఇతర రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి బంధువులు విజయంతో చేయడానికి తమ పార్టీ నాయకత్వం అంత కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర బంద్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES