నవతెలంగాణ – వనపర్తి
సిపిఐ అగ్రనేత మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆదివారం హైదరాబాదులో జరగనున్నాయి. ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు వనపర్తి పానగల్ మండలాల ముఖ్య నేతలు హైదరాబాద్ తరలి వెళ్లారు. వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీ రామ్, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సిపిఐ దిగ్గజనేత సుధాకర్ రెడ్డి మరణంతోదేశంలోని వామపక్ష పోరాటాలకు నష్టమన్నారు. కర్నూలు పాఠశాల విద్యాభ్యాసం నుంచి 15 ఏళ్ల వయసులో పోరాటం ప్రారంభించి జీవిత చరమాంకం వరకు కొనసాగించారన్నారు.
84 ఏళ్ల వయసు అనారోగ్య స్థితిలోనూ ఎర్రచొక్క ధరించి కమ్యూనిస్టు పార్టీ సభలకు హాజరై సందేశం ఇవ్వడం పార్టీ పట్ల ఆయన నిబద్ధతను అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు. దేశంలో కమ్యూనిస్టుల చీలిక వల్ల ప్రజా వ్యతిరేక మతతత్వ శక్తులు బలపడి పేద వర్గాలకు తీవ్ర నష్టం కలిగించిందనే భావనతో ఐక్యత కోసం తపించారన్నారు. సమ సమాజ స్థాపన, కమ్యూనిస్టుల ఐక్యత ఆయన ఆశయమని సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి కాగలదన్నారు. ఆయన మరణం దేశంలోని పాలు ప్రధాన పార్టీల నేతలతో పాటు సామాన్య కార్యకర్త ప్రజలను సైతం కదిలించిందన్నారు. ఫలితంగా జిల్లాలో పార్టీ ఉన్న ప్రతి గ్రామంలో, లేని గ్రామాల్లోనూ శనివారం నివాళులు అర్పించారన్నారు. ప్రజలకు కార్యకర్తలకు ఆయన పట్ల గల ప్రేమకు అభిమానానికి నిదర్శనం అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య వనపర్తి జిల్లా గౌరవాధ్యక్షులు మాజీ సర్పంచ్ కళావతమ్మ, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, మాజీ ఉప సర్పంచ్ కాకం బాలస్వామి పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,సిపిఐ పాన్గల్ మండల కార్యదర్శి డంగు కురుమయ్య కేతేపల్లి గ్రామ శాఖ కార్యదర్శి చిన్న నారాయణ, తెల్లరాల్లపల్లి గ్రామ శాఖ కార్యదర్శి సహదేవుడు, మాజీ వార్డ్ సభ్యుడు లక్ష్మీనారాయణ, కాకం రాముడు, కురువ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
సురవరంకు కన్నీటి వీడ్కోలుతో కదలిన సీపీఐ నేతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES