నవతెలంగాణ – మోపాల్
ఆదివారం మొపాల్ మండలంలోని బాడ్సి, చిన్నాపూర్, కులాస్పూర్ గ్రామాల మధ్యలో ఉన్న పంట పొలాలను, ఈ మధ్యకాలంలో బాడ్సి గ్రామంలో ప్రారంభం చేసిన విద్యుత్ సబ్స్టేషన్, దానికి సంబంధించిన 33 కెవి లైన్, రోడ్డు పక్కన స్థంభాలు వేయడం జరిగింది. ఈ స్తంభాలు అకాల వర్షాలతో రైతుల పంట పొలాల్లో పడిపోయాయి. రైతులు ఎక్కడ కరెంటు ఉందో, ఎక్కడ లేదో తెలియక భయాందోళనలకు గురయ్యారు. సంబంధిత అధికారులు పంట పొలాల్లో ఉన్న వైర్లను స్తంభాలను తొలగించలేకపోవడం, రైతులకు కరెంటు సప్లై చేయడంలో విద్యుత్ ఆధికారుల నిర్లక్ష్య వైఖరి, విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్ సైడ్ లూజుగా ఉన్న మట్టిలో పోల్స్ పాతడం వల్ల పడిపోయాయి.
కాంట్రాక్టర్ గాని, అధికారులు గానీ రైతుల పంట పొలాల్లో ఉన్న స్తంభాలను వైర్లను తొలగించి రైతులకు ఎలాంటి ఆటంకం గలగకుండా విద్యుత్ సరఫరా చేయాలని, అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని పంట నష్టం సర్వే చేసి, రైతులను ఆదుకోవాలని అన్నారు. కొత్తగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నాసరకం రోడ్డువేసినందున ఈ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కావున ఈ సమస్యలపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి పరిష్కరించాలని సిపిఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సాయ గౌడ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ,అడ్డిక రాజేశ్వర్, హుస్సేన్ ,రైతు నాయకులు జైపాల్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
పొలాల్లో పడిపోయిన విద్యుత్ పోల్స్ ను పరిశీలించిన సీపీఐ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES