- Advertisement -
– పరామర్శించిన జిల్లా నేత పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట: మండలంలోని నందిపాడు కు చెందిన సీపీఐ(ఎం) స్థానిక కార్యకర్త జోగారావు ఇటీవల గుండెపోటు తో తీవ్ర అస్వస్థతకు గురై గుండె ఆపరేషన్ చేయించుకున్నారు.గురువారం ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు.ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, అర్జున్, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావులు ఉన్నారు.
- Advertisement -



