అనారోగ్యంతో కన్నుమూసిన లక్ష్మమ్మ
నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) సభ్యుడు పోలెబోయిన సురేశ్ మాతృమూర్తి లక్ష్మమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించటంతో మరణించారు. ఆమె భౌతికకాయానికి సీపీఐ (ఎం) మండల కార్యదర్శి హుస్సేన్, గ్రామ శాఖ కార్యదర్శి మడూరి నర్సింహాచారి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకటచంద్ర, మండల కమిటీ సభ్యులు నూకల లక్ష్మీనరసమ్మ, కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్, నాయకులు జింకల గోపీ, బెందు వెంకటేశ్వర్లు, కుక్కడపు సోమమ్మ, తంగెళ్ల గోపరాజు, పారుపల్లి శ్రీనివాస్, తదితరులు పూలమాలలేసి నివాళులర్పించారు. లక్షమ్మ మరణం పట్ల సీపీఐ(ఎం) నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. సురేశ్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు.
సీపీఐ(ఎం) సభ్యుడు పోలెబోయిన సురేశ్‌కు మాతృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



