Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) నగర కమిటీ విస్తృతస్థాయి సమావేశం 

సీపీఐ(ఎం) నగర కమిటీ విస్తృతస్థాయి సమావేశం 

- Advertisement -

హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తానని హామీ ఇచ్చారు. అందుకు గుడిసెలు వేసుకొని ఉన్నవారికి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అలాగే గృహ లక్ష్మి పథకం ప్రతి మహిళకు ఇస్తానని హామీ ఇచ్చారు.

అది కూడా అమలు చేయాలని గృహ జ్యోతి కూడా అందరికీ అమల్లోకి రాలేదు. అందరికీ వచ్చేటట్టు చూడాలని 500 కే సిలిండర్ అని చెప్పడం జరిగింది అది కూడా అమలు జరిగే విధంగా చూడాలని లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపకపోతే పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు రాములు, నరసయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, నరేష్ దీపిక, అనిత, శాఖగర్ కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -