Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅక్రమ అరెస్టులను ఖండించిన సీపీఐ(ఎం)

అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులను కార్యకర్తలను, అక్రమంగా శనివారం రాత్రి అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. దీనిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు ఆదివారం తెలిపారు. జిల్లా ప్రజలకు ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్, హోం శాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను అమలులో శ్రద్ధ చూపాల్సింది పోయి, ప్రారంభించిన పసుపు బోర్డునే మరొకసారి ప్రారంభించాలి అని రావడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది తప్ప, మరొకటి కాదని అన్నారు. జిల్లాలో విమానాశ్రయం కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించటం లేదని తెలిపారు. అదే విధంగా బోధన్ టు బీదర్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ల ఏర్పాట్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించటానికి ఆలోచించకపోగా, ప్రశ్నించే పార్టీ నాయకులను కార్యకర్తలను, జైల్లో నిర్బంధించటం ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img