Sunday, October 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ..

స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ..

- Advertisement -

 ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపు..
నవతెలంగాణ – జన్నారం

సీపీఐ(ఎం) జన్నారం మండల జనరల్ బాడీ సమావేశం ఎస్కే అబ్దుల్లా అధ్యక్షతన ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంకె రవి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, కనికరపు అశోక్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హాజరై మాట్లాడుతూ.. ఈ నెలలో జరుగుతున్న ఎంపీటీసీ,జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు. గత అనేక సం.రాలుగా మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) నాయకత్వం అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు.

డబల్ బెడ్ రూమ్ ఇండ్లు,ఉపాధి హామీ పనులు, పోడు భూములకు హక్కు పత్రాలు, గ్రామాలకు రవాణా సౌకర్యం,రోడ్లు, కాల్వవలు,బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని, యువత ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చెయ్యలని, మండల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు సీపీఐ(ఎం) చేయడం జరిగిందని అన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ శాఖలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి మెడికల్ క్యాంపు నిర్వహించాలని, అనాఆరోగ్య బాధితులకు మెరుగైన వైద్యం చేయించాలని నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేయడం జరిగిందన్నారు.

నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం) తరపున పోటీ చేస్తున్న జడ్పిటిసి,ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కొండ గొర్ల లింగన్న సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, సీనియర్ నాయకులు కే.బుచ్చన్న, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు పోతు విజయ,ఒడిపెల్లి ప్రమీల, పర్ల కనకయ్య,ఆత్రం రాజు, అత్రం రవికుమార్,గుడ్ల రాజన్న,యశోద,అంబటి లక్ష్మన్,దాసండ్ల రాజన్న, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -