సీపీసీ ఆహ్వానం మేరకు ఏడు రోజుల పర్యటన
న్యూఢిల్లీ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అంతర్జాతీయ విభాగం ఆహ్వానం మేరకు ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ నేతత్వంలోని ఆరుగురు సభ్యులు గల సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ఏడు రోజుల పర్యటన కోసం చైనా వెళ్లింది. ఈనెల 30 వరకు చైనాలో అక్కడి పార్టీ నేతలతో చర్చలు, పార్టీ పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నట్టు మంగళవారం విడు దల చేసిన ఒక ప్రకటనలో సీపీఐ(ఎం) పేర్కొంది. సోమవారం రాత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రతినిధి బృందం బీజింగ్‌కు బయలు దేరింది. ఈ ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీతో పాటు.. పొలిట్‌బ్యూరో సభ్యులు మొహమ్మద్ సలీం, జితేంద్ర చౌదరి, ఆర్ అరుణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు కె హేమలత , సీఎస్ సుజాత ఉన్నారు.