సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్ మల్లేష్..
నవతెలంగాణ – అచ్చంపేట
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్ మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం అమ్రాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్ మల్లేష్ఎ, స్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ లు మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేసి బీసీల జనాభా 52 శాతంగా ఉంది అని తేల్చింది. దీనిని అనుసరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అట్టి తీర్మానాన్ని గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా 6 నెలలు సమయాన్ని వృధా చేశారన్నారు. వృధా అసెంబ్లీ తీర్మానం కాపీని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి పంపిన కూడా బిజెపి ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలను మోసం చేసిందన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వానికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు రేపు జరిగే బిసి బందులో కూడా బిజెపి వాళ్లు బీసీలకు మద్దతు ఇస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. బిజెపి దొంగనాటకాలు ఆపాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే బందులో బిజెపి పార్టీ పాల్గొన్న వేదికలలో సీపీఐ(ఎం) పాల్గొనదని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) స్వతంత్రంగానే అన్ని మండల కేంద్రాలలో నిరసన ర్యాలీలు చేపడుతుందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం పైన పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శివ ప్రచండ, ఎం వెంకటయ్య, తిరుపతయ్య, ఆర్. తిరుపతయ్య, పర్వతాలు, జోగు తిరుపతయ్య, వెంకటయ్య, మల్లయ్య, సత్యం, శ్రీనివాస్ రెడ్డి, ఎండి. సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు.