Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీవో నెంబర్ 252ను సవరించాలి: సీపీఐ (ఎం) డిమాండ్

జీవో నెంబర్ 252ను సవరించాలి: సీపీఐ (ఎం) డిమాండ్

- Advertisement -

– జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 252 జీవో ద్వారా జర్నలిస్టులను వర్గీకరించాలని భావించింది.రిపోర్టర్లకు అక్రెడిటేషన్, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సాధారణ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులతోపాటు చిన్న, మధ్యతరహా పత్రికలు అక్రెడిటేషన్లను కోల్పోతుండటంతో వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారు . ఈ జీవోను సవరించి, అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న మధ్యతరహా పత్రికలను అదుకోవాలని సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.

రాష్ట్రంలో జర్నలిస్టులకు కనీస భద్రత, సంక్షేమం లేదు. ఆరోగ్య బీమా అమలు కావడంలేదు. హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందడంలేదు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో, విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది .

ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించింది. తక్షణమే జర్నలిస్ట్ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -