– ఆ పార్టీ బలపరిచిన సీత నే గెలిపించాలని
– పార్టీ జిల్లా నేత చిరంజీవి పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏజెన్సీలో గిరిజనులకు రక్షణగా,వారి హక్కులు కాపాడేది సీపీఐ(ఎం) మాత్రమే నని అందుకే ఆ పార్టీ బలపరిచిన మొడియం సీత ఎన్నికల గుర్తు కత్తెర పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యదిక ఆధిక్యంతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాయి గూడెం పంచాయతి కి సర్పంచ్ గా పోటీ చేస్తున్న మొడియం సీత విజయాన్ని కాంక్షిస్తూ పంచాయతీ వ్యాప్తంగా బుదవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతి పరిధిలో గిరిజనులకు పోడు భూములు దక్కే వరకు అలుపెరగని ఉద్యమం నిర్వహించి,కేసులు సైతం ఎదుర్కొని పేదల పక్షాన నాయకత్వం వహించడం లో సీత ముందు ఉన్నారని అన్నారు.వ్యవసాయ కూలీలు, రైతులు,కార్మికులు,కష్టజీవుల పక్షాన అనునిత్యం అలుపెరగని పోరాటాలు నిర్వహించడంలో ఆమె కృషి అమోఘం అన్నారు.పాలక పార్టీల ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీగా పనిచేసే సీపీఐ(ఎం) బలపరిచిన సీతకు యావన్మంది తమ ఓట్లు వేసి గ్రామ పంచాయతీని ఆదర్శంగా నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.
మల్లాయిగూడెం పంచాయితి పరిధిలోని శివారు గ్రామాలైన పండువారిగూడెం, దిబ్బగూడెం ల్లో ఓట్లు అభ్యర్థిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కమిటీ సభ్యులు తిరుపతమ్మ, దుర్గారావు, సారిన నాగేశ్వరావు, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.



