- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ పరామర్శించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో రాజేశ్వర్‌రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సర్జరీ అయ్యింది. రాజేశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వారు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలనీ, ప్రజల్లో తిరగాలని ఆకాంక్షించారు.
- Advertisement -