- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన కామ్రేడ్ సాల్వాది బాలయ్య (హెడ్ కానిస్టేబుల్) తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు పార్టీ నాయకులు శనివారం సింగారం గ్రామానికి వెళ్లి బాలయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా నాయకులు దేశ్యానాయక్, అచ్చంపేట మండల కార్యదర్శి కామ్రేడ్ సైదులు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కామ్రేడ్ సయ్యద్, ఆర్టీసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ శివకుమార్, రాములు, సీపీఐ(ఎం) మల్లేష్, మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ నిర్మల, సింగారం గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -