సమస్యలు పరిష్కరించాలని విన్నపం…
నవతెలంగాణ – అశ్వారావుపేట: సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి నేతృత్వంలో మండలంలో అపరిస్క్రుతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లుకు వినతి పత్రం అందించారు. నూతనంగా నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కోసం శంఖుస్థాపన కు శనివారం అశ్వారావుపేట వచ్చిన ఆయనకు మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ తో కలిసి వినతి పత్రాన్ని అందించారు.
వినతి పత్రంలో పొందుపరిచిన విషయాలు యదాతధం.. అశ్వారావుపేట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల్లో ముఖ్యంగా భూమి సమస్యలు, పోడు సాగు దారులకు పట్టాలు, మంచినీటి ఎద్దడి పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా మండలంలోని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ఉరువలబండ, పెద్ద మిద్దె రేగళ్ళ, జిల్లేడిపాక, రమణక్కపేట కాలనీ కొత్త కావడిగుండ్ల కాలనీ (ఉరవకొండ) ప్రాంతాలలో, మండలంలో ఉన్న పలు గ్రామాలలో వేసవికాలం తీవ్రత దృష్ట్యా నీటి సమస్య అధికంగా ఉన్నదని, భూ సమస్యల విషయంలో కన్నాయిగూడెం రెవిన్యూ పరిధిలో సుమారు 6 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న సర్వే నెంబరు 152, అశ్వారావుపేట రెవిన్యూ సర్వే నెంబర్ 911 లలో గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినా భూమికి మాత్రం ఫారెస్టు వారు అభ్యంతరం పెడుతున్నారు అని తెలిపారు. జాయింట్ సర్వే చేయింగా భూమి రెవిన్యూ పరిధిలోనే అని తేల్చి చెప్పారు. ఆరోజు నుండి ఈ రోజు వరకు కూడా సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వటం లేదు. అలాగే పోడు సాగు చేసుకుంటున్న హక్కు పత్రాలు రాని పోడు సాగు దారులు అందరికీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఇవ్వాలని కోరారు. పై విషయములను పరిశీలించి మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలరని కోరారు.
డిప్యూటీ సీఎం భట్టికి వినతి పత్రం అందించిన సీపీఐ(ఎం) నాయకులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES