నవతెలంగాణ – కంఠేశ్వర్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, ప్రతినిధి బృందం ఇటీవల కత్తి పొట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులుు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చి వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వారికి ప్రకటించిన ఎగ్స్ గ్రేషియాను వెంటనే చెల్లించాలని, కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఆ ఘటనలో కత్తిపోట్లకు గురైన అశోక్ కూడా ఉపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రోజు రోజుకు నగరంలో అరాచక శక్తులు పెరిగిపోతున్నాయని, అటువంటి వారి పట్ల పోలీస్ యంత్రాంగం అధికారులు కఠినంగా వ్యవహరించాలని, గస్తీకి తిరుగుతున్న పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలని వారు కోరారు.
నగరంలో గంజాయి డ్రగ్స్ వాడకం కూడా పెరుగుటంతో అరాచక వాదులకు వాటి మత్తులో తామేం చేస్తున్నాము కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారని వారన్నారు. మత్తు పదార్థాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్,నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, సిఐటియు రాష్ట్ర నాయకులు మధు, షంషాద్, ఉద్ధవ్ పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీపీఐ(ఎం) నాయకుల పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



