Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

- Advertisement -

ఎమ్మెల్యే నిధులు కేటాయించాలి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

కాటమయ్య నగర్ లో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ సోమవారం నాడు సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్  పట్టణ నాయకులు మోరిగాడి రమేష్  మాట్లాడుతూ కాటమయ్య నగర్ లో సీసీ రోడ్లు మురుగు కాలువలు నిర్మాణం చేయకపోవడం వలన దశాబ్దాలుగా ఆ కాలనీవాసులు వర్షాకాలం వచ్చిందంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే తన నిధుల నుండి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు.పన్నులు వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం లో చూపించడం లేదన్నారు.

సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.వెంటనే కాటమయ్య నగర్ నుండి ఆలేరు పెద్దవాగు వరకు మురుగు కాలువ నిర్మాణం చేయాలని, కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణము మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలన్నారు. కాటమయ్య నగర్ నుండి జాతీయ రహదారి దర్గా వరకు రోడ్డు వేసి వీధి లైట్ల స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిసి రోడ్లు మరుగు కాలువలు ఇతర సమస్యల పై గతంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ని కలిసి విన్నవించగా గతంలో హామీ ఇచ్చారు. పనులు ప్రారంభిస్తా అని చెప్పారు. ఏడాది కావస్తున్న ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగలేదని వెంటనే ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ధర్నాలో పాల్గొన్న కాలనీ ప్రజలు”మేము ఇల్లు కట్టుకొని దాదాపుగా 30 సంవత్సరాలు గడిచినప్పటికీ మా వీధిలో సీసీ రోడ్డు రాలేదని మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని కమిషనర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు.” కమిషనర్ శ్రీనివాసరావు  మాట్లాడుతూ.. కాటమయ్య నగర్ వాసులు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ నాయకులు ఘణగాని మల్లేశం, అయిలి చంద్రకళ,మద్దెల కుమార్, ధడక గణేష్,మోరిగాడి అనిత,మైలారం కళ్యాణి,కుడుదుల భాగ్య, కటకం పుష్ప,అంగిరేకుల భాగ్య,రచ్చ వజ్రమ్మ,బేతి పద్మ,కడవేరు ఉమా,కడివేరు లక్ష్మి,మోరిగాడి దేవి, బేతి రఘురాములు,లక్కాకుల శ్రీను, రేగోటి నరేందర్,మోరిగాడి అశోక్, మోరిగాడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -