Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యాచరణ

మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యాచరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : గత రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తలకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు కులము మతము పార్టీ అవగాహన పైన, పార్టీ నిర్మాణం, కర్తవ్యాలు అనే అంశాల పైన వివరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. నిజాంబాద్ జిల్లాలో ప్రజల్లో విదేశాలను రెచ్చగొట్టడానికి కులం, మతం ప్రాతిపదికన ప్రజల్లో అనైక్యతను సృష్టిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలన్నారు. ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పాటు పసుపు బోర్డు వల్ల రైతులకు ప్రయోజనం మెరుగుపరచటానికి, రైల్వే లైన్ డబల్ లైన్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుదల కొరకు ఇచ్చిన హామీని అమలు జరపాలని తెలిపారు. మహిళలకు రూ.2500 భృతి చెల్లింపు కొరకు గానీ, విత్తనాభివృద్ధి సంస్థ పరిశ్రమల నెలకొల్పుట గురించి కానీ తెలంగాణ యూనివర్సిటీ నిధుల కేటాయింపు కొరకు, హాస్పిటల్లో వైద్యం మెరుగుదల కొరకు పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కష్టజీవులను ఐక్య పోరాటాల ద్వారా సంఘటితపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు , పి వెంకటేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, కొండ గంగాధర్, నన్నే సాబ్, సుజాత,  నాయకులు సాయిలు, అనసూయ, అనిత, కటారి రాములు, నరసయ్య, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad