Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ(ఎం) నివాళి

సురవరం సుధాకర్ రెడ్డికి సీపీఐ(ఎం) నివాళి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సీపీఐ(ఎం) కార్యాలయంలో సిపిఐ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతో ప్రజల పక్షాన జీవితాంతం పనిచేసే అనేక పోరాటాలు నిర్వహించారని, అటు పార్లమెంట్లో ఇటు బయట కష్టజీవుల సమస్యల పైన నిరంతరం కృషి చేశారని కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేశారని ఆయన అన్నారు.

సాధారణ జీవితాన్ని గడుపుతూ అనేకమంది యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారని, చివరి వరకు కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి కృషి చేయటం నేటి యువత ఆచరించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఆయన చివరివరకు మతోన్మాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అభిరామంగా కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరాలు మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించినప్పుడే ఆయన ఆశయాలను కొనసాగించిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నగర నాయకులు కటారి రాములు, రాజు,చక్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad