20 సర్పంచ్ స్థానాలు కైవసం
పలుచోట్ల గెలిచే అవకాశం..పూర్తవని కౌంటింగ్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సీపీఐ (ఎం) సత్తా చాటింది. జిల్లాలోని ఏడు మండలాల్లో తొలి దఫా 192 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా..వీటిలో 20 ఏకగ్రీవం అయ్యాయి. అవిపోగా మిగతా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల బీఆర్‌ఎస్ కు సీపీఐ (ఎం) మద్దతిచ్చింది. ఆ పార్టీ మద్దతుతో బలమున్న చోట పోటీ చేసిన స్వల్ప స్థానాల్లోనూ సీపీఐ (ఎం) తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఒకటి, రెండు చోట్ల సీపీఐ (ఎం) మద్దతు స్వతంత్ర అభ్యర్థులు సైతం సర్పంచులుగా ఎన్నికయ్యారు. బోనకల్ లో అత్యధికంగా పది పంచాయతీల్లో సీపీఐ (ఎం) అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో రాత్రి పదిన్నర గంటల వరకు కౌంటింగ్ పూర్తయిన పెదబీరవల్లి, గోవిందాపురం, చొప్పకట్లపాలెంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను సీపీఐ (ఎం) దక్కించుకుంది. వీటితోపాటు ఇదే మండలం గార్లపాడు, మోటమర్రి సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. బోనకల్ మండల కేంద్రంతో పాటు ఆళ్లపాడు వైస్ ప్రెసిడెంట్ గానూ సీపీఐ (ఎం) అభ్యర్థులు ఎన్నికయ్యారు. చింతకాని, కొణిజర్ల, వైరాతో పాటు రఘునా థపాలెం మండలాల్లోనూ సీపీఐ (ఎం) సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల ను పొందగలిగింది. దాదాపు ప్రతి చోట బీఆర్‌ఎస్ మద్దతు తెలుపగా ఒకటి రెండు చోట్ల సీపీఐ సైతం మద్దతు ఇచ్చింది. ఇటీవల హత్యకు గురి అయిన సీపీఐ (ఎం) సీనియర్ నేత సామినేని రామారావు స్వగ్రా మం చింతకాని మండలం పాతర్లపాడులో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను సీపీఐ (ఎం) కైవసం చేసుకుంది. ఇదే మండలం కొదుమూ రు, పందిళ్ళపల్లి, నాగులవంచ రైల్వే కాలనీల్లోనూ ఈ పార్టీకి చెందిన అభ్యర్థులే సర్పంచులుగా ఎన్నికయ్యారు. అలాగే నరసింహపురం ఉపసర్పంచ్ స్థానాన్ని సైతం సీపీఐ (ఎం) కైవసం చేసుకుంది. ఇక కొణిజర్ల మండలంలోని మూడు స్థానాల్లో సీపీఐ (ఎం) బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసింది. వీటిలో రెండు చోట్ల గోపవరం సర్పంచ్, ఉప సర్పంచ్ గాను సీపీఐ (ఎం) అభ్యర్థులే ఎన్నికయ్యారు. సింగరాయపాలెం సర్పంచ్ స్థానంతో పాటు సిద్ది నగరం ఉపసర్పంచ్ పదవులను ఈ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. మండలంలోని జానకీపురం సర్పంచ్‌గా సీపీఐ (ఎం) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అలాగే వైరా మండలం అష్ణగుర్తి సర్పంచ్, సర్పంచ్ పదవులను సీపీఐ (ఎం) అభ్యర్థులు గెలుచుకున్నారు. మధిర మండలం మల్లారంలోనూ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులనూ పార్టీ పొందగలిగింది. రఘునాధపాలెం మండలం గణేశ్వరం, ఎర్రుపాలెం మండలం నరసింహాపురం, తిమ్మినేనిపాలెం ఉప సర్పంచ్ పదవులను సీపీఐ (ఎం) అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని సీట్లు ఈ పార్టీ అభ్యర్థుల ఖాతాలో పడనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను సీపీఐ(ఎం) గెలుపొందింది. దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీనగరం, దుమ్మగూడెం, పగళ్లపల్లి, అజిపాక, రామారావుపేట, మహదేవపురం, మణుగూరు మండలంలో పగిడేరు, పినపాక మండలంలో బోటిగూడెం, బూర్గంపాడు మండలంలో టేకులచెర్వులో సీపీఐ(ఎం) గెలిచింది.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమి నేడులో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి బొంతల చంద్రారెడ్డి గెలుపొందారు. నూతనకల్ మండలం చిల్పకుంట్లలో అంజపల్లి నర్సమ్మ గెలుపొందారు. సూర్యపేటలో జిల్లా ఒక గ్రామంలో సీపీఐ(ఎం) గెలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మద్‌పల్లిలో సీపీఐ(ఎం) గెలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కిష్టంపల్లిలో రెండు వార్డులు, వనపర్తి జిల్లా సింగరాయపల్లిలో 4 వార్డుల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందారు. కల్వకుర్తి మండలం ముకరాల గ్రామంలో సర్పంచ్‌గా సిద్దయ్య ఘనవిజయం సాధించారు. జాజాలలో 8 వార్డులకు నాలుగు వార్డులు, పోతారెడ్డిపల్లిలో 4 వార్డుల్లో విజయం సాధించగా, 12 ఓట్ల తేడాతో సర్పంచి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. తెలకపల్లి మండలం బొట్పల్లిలో నాలుగో వార్డ్డులో విజయం సాధించారు. గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో 2 వార్డుల్లో విజయం సాధించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడులో అశోక్, మహబూబ్‌నగర్ జిల్లా జూలపల్లిలో ఆరు వార్డుల్లో విజయం సాధించారు.
ఉమ్మడి ఖమ్మంలో సీపీఐ(ఎం) సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



