Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయంజంతర్ మంతర్ వద్ద CPI(M) ఆందోళ‌న‌

జంతర్ మంతర్ వద్ద CPI(M) ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వద్ద‌ సీపీఐ(ఎం) ఆందోళ‌న చేప‌ట్టింది. అభ్యంతరకరమైన వీడియోను బిజెపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి విడుదల చేసినందుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద CPIM మంగళవారం నిరసన వ్యక్తం చేసింది.

కాగా, మతతత్వాన్ని రెచ్చగొట్టేలా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రసంగాలు, ఇటీవల తొలగించబడిన సోషల్‌ మీడియా పోస్టుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ఆ చిత్రంలో ముస్లింలుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల యానిమేటెడ్‌ చిత్రాలకు ఆయన తుపాకి గురి పెడుతున్నట్టు ఉన్న ఆ పోస్టులో పక్కనే ‘పాయింట్‌ బ్లాంక్‌ షాట్‌’, ‘నో మెర్సీ’ వంటి పదాలు కూడా వున్నాయి. దీనిపై సత్వరమే విచారణ జరపాలని న్యాయవాది నిజామ్‌ పాషా మౌఖికంగా ప్రస్తావించిన వెంటనే చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆమోదం తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ హిమంత బిశ్వ శర్మ ఇటువంటి ప్రసంగాలు చేశారని సీపీఐ(ఎం) తన పిటిషన్‌లో పేర్కొంది.

ఈఉం సీఎం హిమంత విస్వా శర్మ నటించిన అ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -