నివాళులర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-కందుకూరు
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బాక రాంచందర్ తండ్రి దుబ్బాక పెంటయ్య అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాంచందర్ స్వగ్రామానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు రాష్ట్ర నాయకులు వెళ్లి పెంటయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వెస్లీ మాట్లాడుతూ.. పెంటయ్య మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పలువురు జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



