– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాల్టీలో పోటీ కి సిద్దం కావాలని పార్టీ కేడర్ కు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కమిటి కార్యదర్శివర్గ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు న్న ప్రతీ వార్డులో ను పార్టీ ప్రభావం చూపేలా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని,అందుకోసం పార్టీ విధానాలు,నిర్ణయాలకు లోబడి పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి, మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు తగరం నిర్మల,మడకం గోవిందు,మడిపల్లి వెంకటేశ్వరరావు,మండల కమిటీ సభ్యులు నారం అప్పారావు,దుర్గారావు,తిరుపతమ్మ,కలపాల భద్రం,సీతారామయ్య లు పాల్గొన్నారు.



