కల్వకుంట్లలో డబ్బు, మద్యం ప్రలోభాలతో గెలవాలని ఎన్ని కుట్రలు చేసిన ప్రజాస్వామ్య గెలిచింది..
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన సింగపంగా లక్ష్మమ్మ దంపతులను, వార్డు నెంబర్ అయితగొని యాదయ్యను, కల్వలపల్లి ఉప సర్పంచ్ శివర్ల వీరమల్లు ను బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్వకుంట్ల గ్రామంలో జరిగిన ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రలోభాలతో గెలవాలని ఎన్ని కుట్రలు చేసిన ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల పక్షాన పోరాడే నిరుపేద రాలైన లక్ష్మమ్మను గెలిపించడంతో కల్వకుంట్ల ప్రజలకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల పక్షాన పోరాడే గొంతులో గెలిపించేందుకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ , ధర్మసమాజ్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, సీనియర్ నాయకులు నారగొని నరసింహ, మాజీ సర్పంచ్ సింగపంగా గౌరయ్య, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, పగడాల కాంతయ్య, పగిళ్ల మధు , సిహెచ్ బిచ్చం, పగిళ్ల యాదయ్య తదితరులు ఉన్నారు.



