Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధికై సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి: గోశిక కరుణాకర్

గ్రామాల అభివృద్ధికై సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి: గోశిక కరుణాకర్

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చిన్న కొండూరు,నేలపట్ల,పంతంగి, మందోళ్లగూడెం గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గోశిక కరుణాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు, నేలపట్ల గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న కొండూరు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎలకరాజు యాదగిరిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఎలక రాజు యాదగిరి గ్రామాభివృద్ధికి చేసిన సేవలు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.గ్రామంలో నీటి కరువు నివారణకు చర్యలు చేపట్టడం, హైస్కూల్ భవన నిర్మాణం,పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, అర్హులకు పెన్షన్లు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు ఏర్పాటు చేయించి ప్రజల నిత్యావసర సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఇటువంటి ప్రజానుకూల పనులు చేసిన నాయకుడికి మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

అదేవిధంగా చిన్న కొండూరు, నేలపట్ల, పంతంగి, మందోళ్లగూడెం గ్రామాల్లో సీపీఐ(ఎం) పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎలక రాజు యాదగిరి,తడక పారిజాత,కొండే శ్రీశైలం,బోయ మానస లను గెలిపించాలని ప్రజలను కోరారు.గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ సీపీఐ(ఎం) పార్టీతోనే సాధ్యమని గోశిక కరుణాకర్ స్పష్టం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం ఎండి పాషా మాజీ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్ బండారు నరసింహ బత్తుల దాసు తడక మోహన్ ఎండి ఖయ్యూం ఆకుల ధర్మయ్య గుణముని ఐలయ్య తూర్పునూరు మల్లేష్ గౌడ్ బుట్టి కృష్ణ బత్తుల వేణు సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, చిన్న కొండూరు గ్రామ కార్యదర్శి చింతల సుదర్శన్,నాయకులు చింతపల్లి నర్సిరెడ్డి, చెరుకు రమేష్,ఎలక రాజు ఉపేందర్,తీగుళ్ల శ్రీనివాస్,పగిళ్ల జంగారెడ్డి,పగడాల బిక్షం, చెక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఐక్యంగా నిలిచి అభివృద్ధికి కట్టుబడి ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -