Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఏవి రాజు మృతి

సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఏవి రాజు మృతి

- Advertisement -

ఎర్రగడ్డ మీటర్‌ ఫ్యాక్టరీలో కార్మిక నాయకునిగా సేవలు

నవతెలంగాణ – బాలానగర్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, ఎర్రగడ్డ మీటర్‌ ఫ్యాక్టరీలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించిన ఏవి రాజు(74) శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. మీటర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కార్మికుల హక్కుల సాధన కోసం అహర్నిశలూ కృషి చేసిన రాజు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడూ యాజమాన్యంతో పోరాడుతూ కార్మికవర్గానికి అండగా నిలిచారు. నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధతతో పార్టీ పట్ల, కార్మిక ఉద్యమం పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం పార్టీకి, సీఐటీయూకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఏవీ రాజు జీవితం కార్మికులకు ఆదర్శమని, నిజాయితీ గల కామ్రేడ్‌గా, పోరాటశీల నాయకుడిగా కార్మికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -