– నివాళులర్పించిన ఎండి అబ్బాస్, నాయకులు
నవతెలంగాణ-మెహిదీపట్నం
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, హైదరాబాద్‌లోని కార్వాన్ జోన్ కమిటీ సీనియర్ సభ్యులు, పేదల పక్షపాతిగా పేరొందిన మహమ్మద్ బాబా(55) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు శుక్రవారం గోల్కొండలోని బాబా నివాసానికి వెళ్లి ఆయన మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ మాట్లాడుతూ.. గోల్కొండ ప్రాంతంలో పార్టీ జెండాను తొలిసారిగా నిలబెట్టిన నాయకుడు మహమ్మద్ బాబా అని కొనియాడారు. ఆ ప్రాంతంలో నిరంతరం పనిచేస్తూ రేషన్ కార్డులు, స్థానిక సమస్యలు, కార్మికుల సమస్యలపై ఆయన అంకితభావంతో పోరాటం చేశారని అన్నారు. బాబా మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.విట్టల్, నాగేశ్వరావు, ఎం.మీనా, నాయకులు, సానుభూతిపరులు బాబాకు నివాళులర్పించారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మహమ్మద్ బాబా మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



