Saturday, December 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'పల్లె' తొలి విడత పోరులో సీపీఐ(ఎం) సత్తా

‘పల్లె’ తొలి విడత పోరులో సీపీఐ(ఎం) సత్తా

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల సర్పంచ్‌ల కైవసం
అత్యధిక వార్డుల్లో గెలుపు
పలుచోట్ల దక్కిన ఉప సర్పంచ్‌ పదవులు

గ్రామ పంచాయతీ ‘మొదటి విడత’ ఎన్నికల పోరులో సీపీఐ(ఎం) మెరుగైన ఫలితాలను సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకు న్నట్టు నేతలు తెలిపారు. అత్యధిక వార్డుల్లో గెలు పొందడంతో పాటు ఉప సర్పంచ్‌ పదవులు దక్కాయని తెలిపారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని, మిగతా రెండు విడతలు ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే లెక్కలు తేలుతాయన్నారు. పోటీ చేసిన ప్రతిచోట పార్టీ అభ్యర్థుల ప్రాతినిధ్యం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీల్లో సీపీఐ(ఎం) మద్దతుదారులు గెలిచారు. ఆ తర్వాత నల్లగొండతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోని పంచాయతీలను, వార్డులను కైవసం చేసుకున్నారు.

నవతెలంగాణ – విలేకరులు
ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) 28 సర్పంచ్‌ స్థానాల్లో పోటీ చేయగా 10 స్థానాల్లో గెలుపొందింది. అలాగే, 75 వార్డుల్లోనూ గెలుపొందింది. ఇటీవల హత్యకు గురయిన సీపీఐ(ఎం) సీనియర్‌ నేత సామినేని రామారావు స్వగ్రామం చింతకాని మండలం పాతర్లపాడులో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులను పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇదే మండలం కొదుమూరు, పందిళ్లపల్లి, నాగులవంచ రైల్వే కాలనీల్లోనూ పార్టీకి చెందిన అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. నరసింహపురం ఉపసర్పంచ్‌ స్థానంలోనూ గెలుపు సొంతమైంది. బోనకల్‌ మండలంలో గోవిందా పురం(ఎల్‌), గార్లపాడు, పెద్దబీరవల్లిలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పదవులు దక్కించుకోగా, బోనకల్‌తో పాటు ఆళ్లపాడు, గుండ్రాతిమడుగులో ఉపసర్పంచ్‌లుగా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కొణిజర్ల మండలంలోని మూడు స్థానాల్లో పోటీచేయగా గోపవరం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ స్థానాలను కైవసమయ్యాయి.

సింగరాయపాలెం సర్పంచ్‌ స్థానంతో పాటు సిద్దినగరం ఉపసర్పంచ్‌ పదవులు పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. మండలంలోని జానకీపురం సర్పంచ్‌గా సీపీఐ(ఎం) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైరా మండలం అష్ణగుర్తి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, మధిర మండలం మల్లారంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులూ కైవసమయ్యాయి. రఘునాధపాలెం మండలం గణేశ్వరం, ఎర్రుపాలెం మండలం నరసింహా పురం, తిమ్మినేనిపాలెం ఉపసర్పంచ్‌ పదవులు సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలుచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలు, 75 వార్డుల్లో పార్టీ గెలుపొందింది. దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీనగరం, దుమ్ముగూడెం, పగళ్లపల్లి, అజిపాక, రామారావుపేట, మహ దేవపురం, మణుగూరు మండలంలో పగిడేరు, పినపాక మండలంలో బోటిగూడెం, వెంకటరామపురం, బూర్గం పాడు మండలంలో టేకులచెర్వులో పార్టీ విజయపాతక ఎగురవేసింది.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, మును గోడు మండలం కాల్వపల్లిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను కైవసం చేసుకుంది. జిల్లాలో ఐదు ఉపసర్పంచ్‌ పదవులను సీపీఐ(ఎం) మద్దతు దారులు కైవసం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం చిల్పకుంట్లలో పార్టీ అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందారు. సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాల్లోని 19 వార్డుల్లో పార్టీ మద్దతుదారులు గెలుపొందినట్టు నేతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం తూర్పుగూడెంలో సర్పంచ్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. జిల్లాలో తొమ్మిది వార్డుల్లో గెలిచినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ మండలం నింగి తండాలో సీపీఐ(ఎం) బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థితో పాటు ఆరు వార్డులు ఏకగ్రీవమ య్యాయి. మరో రెండు వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిపొందారు.

వనపర్తి జిల్లా సింగరాయపల్లిలో పోటీచేసిన నాలుగు వార్డుల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్ధులు గెలుపొం దారు. రేపల్లి మండలం చెరుకుపల్లిలో పోటీచేసిన ఒక వార్డులో విజయం సాధించారు. గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్‌ దొడ్డిలో రెండు వార్డుల్లో విజయం సాధించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడులో ఒకటి, మహబూబ్‌నగర్‌ జిల్లా జూలపల్లిలో సర్పంచ్‌, ఆరు వార్డుల్లో విజయం సాధించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కిష్టంపల్లిలో రెండు వార్డుల్లో విజయం సాధించారు. జాజాలలో 8 వార్డులకు నాలుగు వార్డులు, పోతారెడ్డిపల్లిలో 4 వార్డుల్లో విజయం సాధించారు. తెలకపల్లి మండలం బొట్పల్లిలో నాలుగో వార్డ్డులో విజయం సాధించారు. కల్వకుర్తి మండలం ముకరాల గ్రామంలో విజయం సాధించారు. ఆదిలాబాద్‌ జిల్లా గాదెగూడ మండలం కుండి షేక్‌గూడలో ఐదు వార్డులు, ఉప సర్పంచ్‌ స్థానాన్ని పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

నిర్మల్‌ జిల్లా మామడ మండలం బూరుగుపల్లిలో ఏకగ్రీవం అయింది. 21 వార్డులకు గాను పది ఏకగ్రీవమయ్యాయి. పెంబి మండలం గుమ్మేనా ఎంగ్లాపూర్‌ లో ఉపసర్పంచ్‌ పదవిని కైవసం చేసుకున్నారు. మహ బూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో రెండు వార్డుల్లో గెలిచారు. జనగామ జిల్లా చిల్సూర్‌ మండలం క్రిష్టాజిగూడెంలో ఉపసర్పంచ్‌ పదవిని సీపీఐ(ఎం) గెలుచు కుంది. గబ్బెటలో ఉపసర్పంచ్‌ పదవిని కైవసం చేసుకుంది. స్టేషన్‌ఘనపూర్‌లోని ఇప్పగూడెం ఉపసర్పంచ్‌తో పాటు ఆరు వార్డుల్లో గెలుపొందారు. రంగరాయిగూడెం, సము ద్రాలు, కోమటిగూడెం గ్రామాల్లో ఉపసర్పంచ్‌ పదవులను, తాటికొండలో ఒకవార్డులో విజయం సాధించారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఒక వార్డు, భూపాల పల్లి జిల్లా చిన్నకొడపాకలో వార్డు, హన్మకొండ ఎల్కతుర్లి, రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం దేవునితండాలో వార్డు సభ్యులుగా గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -