అనారోగ్యంతో సుమిత్రిబాయి మృతి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సంతాపం
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ భార్య సుమిత్రిబాయి(60) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం 42వ వార్డులోని నివాసంలో ఆమె మృతదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుమిత్రిబాయి మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో.. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణం వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శులు డా. మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
జాన్‌వెస్లీ సంతాపం
సుమిత్రిబాయి మృతి పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేశంకు సతీవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES