సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరైన అఖ్లాక్ భార్య
ఆమె వెంట బృందాకరత్
గ్రేటర్ నోయిడా : అఖ్లాక్ కుటుంబానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేత బృందాకరత్ భరోసా ఇచ్చారు. కోర్టులో అఖ్లాక్ మూక హత్య కేసు విచారణ సందర్భంగా సాక్ష్యం చెప్పటానికి వెళ్లిన అఖ్లాక్ భార్యకు తోడుగా బృందాకరత్ వెళ్లారు. అయితే ప్రస్తుత కోర్టు నుంచి తనను బదిలీ చేయాలన్న నిందితుడి దరఖాస్తుకు ప్రాసిక్యూషన్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో నిందితుడితో ప్రాసిక్యూషన్ కుమ్మక్కైనట్టు మరోసారి రుజువైందని బృందాకరత్ ఆరోపించారు. కేసును ఉపసంహరించుకోవాలన్న యోగి సర్కార్ దరఖాస్తును తిరస్కరించారు. అయితే బదిలీ దరఖాస్తు నిర్ణయం తీసుకునే వరకు విచారణను వాయిదా వేశారు.
అఖ్లాక్ కుటుంబానికి సీపీఐ(ఎం) అండ
- Advertisement -
- Advertisement -



