అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు..
నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గౌని అంజయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. మండల పార్టీ అధ్యక్షులు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆదివాసి సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు వివిధ గ్రామాల ప్రజల మధ్యలో ఆయన అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య సాగాయి. టపాసులు పేల్చుకుంటూ పార్థవ దేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. గౌని అంజయ్య ఒక మంచి నాయకుని ఆయన మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం అన్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, పిఎసిఎస్ డైరెక్టర్లు యానాల సిద్ధి రెడ్డి, రంగరబోయిన జగన్, పులి చిన్న నరసయ్య గౌడ్, ఆలేటి ఇంద్రారెడ్డి, భూషబోయిన రవి, పంజాల శ్రీను, తమ్మల సమ్మయ్య గౌడ్, సత్యనారాయణ, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మోకాళ్ళ వెంకటేష్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, మహిళలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
CPIM: అశ్రు నయనాలతో గౌని అంజన్న అంత్యక్రియలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES