Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) విజయం

సీపీఐ(ఎం) విజయం

- Advertisement -

మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ పదవుల్లో కీలకం
పలుచోట్ల గట్టిపోటీ


నవతెలంగాణ – విలేకరులు
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) 13వార్డుల్లో గెలుపొందింది. మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ పదవుల్లో సీపీఐ(ఎం) స్థానాలు కీలకం కానున్నాయి. మున్సిపల్‌లోని 36 వార్డుల్లో సీపీఐ(ఎం) 3 స్థానాల్లో గెలిచింది. 15వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ బాబు, 16వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ పద్మ, 29వ వార్డు సుర్ణపు సోమయ్య గెలుపొందారు. కాగా, కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసిన ఈ మున్సిపాల్టీలో వైస్‌ చైర్మెన్‌ స్థానం 29వ వార్డు కౌన్సిలర్‌, సీపీఐ(ఎం) నేత సుర్ణపు సోమయ్యకు దక్కనుంది. జనగామ మున్సిపాల్టీలో 3వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి బూడిద జ్యోతిగోపి, నర్సంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో 10వార్డు కౌన్సిలర్‌గా హన్మకొండ శ్రీధర్‌ గెలుపొందారు. వనపర్తి మున్సిపాలిటీలో 18వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి గంధం మదన్‌ 330 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

అమరచింత 7వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి చెన్నంశెట్టి మాధవి.. బీజేపీ అభ్యర్థిపై 30ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) 4 వార్డుల్లో గెలుపొందింది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) 2 వార్డులు, వైరాలో ఒక వార్డు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో ఒక వార్డును కైవసం చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఘనవిజయం సాధించారు. 6వ వార్డులో సీపీఐ(ఎం) కౌన్సిలర్‌ అభ్యర్థి శీలం నాగమణి శ్రీనివాస్‌ స్వతంత్ర అభ్యర్థి ములకలపల్లి రమాదేవిపై 517 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ(ఎం) అభ్యర్థి బత్తుల జయమ్మ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు భార్య జయమ్మ 374 ఓట్ల మెజారిటీతో సంధ్యపై గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -