– సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల నామినేషన్ దాఖలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల గెలుపు ఖాయమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ(ఎం) అభ్యర్థిని గా తగరం నిర్మల గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఆంగోతు వెంకటేశ్వరరావు, ఎం. జగన్మోహన్ రెడ్డిలకు అందజేశారు.
ఈ సందర్భంగా కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ, అశ్వారావుపేట ప్రజల సమస్యలను మున్సిపాలిటీలో చర్చించి పరిష్కరించాలంటే ప్రజల తరఫున నిజమైన ప్రతినిధులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతుతో 21 వ వార్డులో పోటీ చేస్తున్న తగరం నిర్మల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకురాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బి. చిరంజీవి, మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, నార్లపాటి రవిబాబు, క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న తగరం నిర్మల ఐద్వా అశ్వారావుపేట డివిజన్ నాయకురాలిగా కొనసాగుతున్నారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం సీపీఐ(ఎం) మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;



