(ప్రాథమిక సమాచారం మేరకు)
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) సాధించిన విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. డబ్బు, మద్యం, కుల, మత సమీకరణలు వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో కమ్యూనిస్టుల్ని గెలిపించి, ప్రజలు నిజమైన రాజకీయ తీర్పును ప్రకటించారు. రాజకీయాలు మురికిగా ఉండాల్సిన అవసరం లేదని, ఓటు డబ్బుకు బానిస కాదని చాటిచెప్పారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, చైతన్యవంతులైన ఓటర్లు ఎర్రజెండాకు అండగా నిలిచి, రాజకీయ మార్పు సాధ్యమేనని నిరూపించారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయాలకు ఆశాజనకమైన సంకేతాలుగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషికులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి సమయం ఎంతో దూరంలో లేదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.




