Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్ గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి సిపిఎం పార్టీ డిమాండ్.

 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి సిపిఎం పార్టీ డిమాండ్.

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
 స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలొ డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు ఎదురైతున్నాయని త్రాగునీటి సమస్యతోపాటు మురికి కాలువల పారిశుభ్రత అస్తవ్యస్తంగా మారినాయని విద్యుత్ సమస్య గ్రామ పంచాయతీలలో నిధులు లేక పారిశుద్ధ కార్మికులకు వేతనాలు రెండు మూడు నెలలు గడుస్తున్నాయని అన్నారు . కొన్ని గ్రామాలలో నూతనంగా సీసీ రోడ్లు వేశారు కానీ క్యూరింగ్ మరిచిపోయినారని దానివల్ల గ్రామల్లో అనుకోరాని సమస్యలు వచ్చినప్పుడు గ్రామానికి దిక్కు అయినా సర్పంచ్ వార్డ్ మెంబర్లు లేక ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పాలొ తెలియని పరిస్థితి నెలకొందని ఆయన  తెలిపారు . చాలా గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడంలో గ్రామపంచాయతీ పాలకవర్గము లేక గ్రామసభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీర్మానం చేయాలన్న పాలకవర్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని పేర్కొన్నారు . గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చే జూన్ నెల వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాలలో వర్షానికి శానిటైజేషన్ , క్లోరినేషన్  చేపట్టకపోతే ప్రజలు మసుచి ,కలరా ,డెంగి, అనేక అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కావున గ్రామీణ స్థాయిలో అనేక సమస్యల దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించకపోతే గ్రామీణ స్థాయిలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -