నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని వివిధ పాఠశాలల్లో సిపిఎస్ ను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కృష్ణకర్ రావు మాట్లాడుతూ.. 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సిపిఎస్ , యుపిఎస్ పద్ధతులలో ఉద్యోగికి సామాజిక భద్రత ఉండదని పాత పెన్షన్ విధానంలోనే సామాజిక భద్రత ఉంటుందని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేందర్, శ్రీనివాస్, రాజు, స్వామి, చిన్నయ్య, జాస్మిన్, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ను రద్దు చేయాలి ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES