Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ ను రద్దు చేయాలి..

సీపీఎస్ ను రద్దు చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ ను రద్దు చేసే వరకు తపస్సు నిరంతరంగా పోరాటాలు చేస్తుందని తపస్ మండల అధ్యక్షుడు పెరుగు మల్లేశం అన్నారు. శనివారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షన్ ప్రభుత్వ బిక్ష కాదు.. ఉపాధ్యాయుల హక్కు అని తెలిపారు. ఎన్ని పోరాటాలు చేసైనా పాత పెన్షన్ విధానాన్ని సాధిం చేవరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన తపస్ అలుపెరుగని పోరాటాలు చేస్తుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల మల్లేశం రవీందర్ రెడ్డి, నాగభూషణం, మురళీధర, నరసింహారెడ్డి, కనకయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -