నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలని, ఒపీఎస్ విధానం అమలు చేయాలని పీఆర్టియు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్ సింగ్, నర్రా నవీన్ యాదవ్ అన్నారు. ఈ విషయమై శనివారం జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవిని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ విధానం కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 28 తీసుకువచ్చిన రోజును ఉద్యోగ, ఉపాధ్యాయ సిపిఎస్ బాధితులకు చీకటి రోజుగా భావిస్తూన్నట్లు పేర్కొన్నారు ఈ 28 జీవోను రద్దు పరచాలని అన్నారు. ప్రభుత్వానికి తమ బాధను తెలియజేయాలని కోరారు. క్కార్యక్రమంలో రాష్ట అసోసియేట్ అధ్యక్షులు విట్టల్ గౌడ్, కనక అభిమాన్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. మోహన్ సింగ్, జిల్లా ఆర్టిక కార్యదర్శి ముజీబ్ పాల్గొన్నారు.
సీపీఎస్ ఎత్తివేసి ఓపిఎస్ అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES