Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

- Advertisement -

ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కి టిఎస్ సిపిఎస్ఈయు వినతి
నవతెలంగాణ – నెల్లికుదురు 

తెలంగాణ రాష్ట్రంలోని 2.6 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల చిరకాల కోరిక అయిన సిపిఎస్ (CPS) రద్దు అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో గళం విప్పాలని కోరుతూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) నాయకులు శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మురళీ నాయక్ ని కలిసి వినతిపత్రం  అందించారు.

శనివారం టీఎస్ సిపి ఎస్ఈ యు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సోనబోయిన రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు  తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ:​ఎన్నికల హామీని నెరవేర్చాలి: గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ (OPS) విధానాన్ని అమలు చేయాలని కోరారు.

​పెన్షనర్ల దయనీయ స్థితి: ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఉద్యోగులకు కేవలం 1500 నుండి 3000 రూపాయల లోపే పెన్షన్ వస్తుందని, 30 ఏళ్లు సేవ చేసిన వారికి సామాజిక భద్రత కరువవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

​రాష్ట్రాల ఆదర్శం: 
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

​తమ గోడును అసెంబ్లీలో వినిపించి, ప్రభుత్వపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని వేడుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడెపు భిక్షపతి, చిడిపాక ఐలయ్య, ప్రణయ్, ఇమామ్, సునీత, సాయి కుమార్ మరియు ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -