Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించండి

రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించండి

- Advertisement -

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి : రైతునేస్తంలో అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలనీ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతు నేస్తం 88వ ఎపిసోడ్‌లో భాగంగా 1600 రైతుల వేదికలను అనుసంధానం చేసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో మంత్రితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్‌, వ్యవసాయ శాఖ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన సందీప్‌ అనే యువ రైతు ప్రకృతి వ్యవసాయం, స్వీయ మార్కెటింగ్‌ అనుభవాలను పాలుపంచుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మహేంద్రరెడ్డి వరి సాగులో నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు నవీన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బాబూరావు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై తన అనుభవాలను పంచుకున్నారు. జగిత్యాల జిల్లా గూడూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..ప్రకృతి వ్యవసాయం చేస్తూ, నానో యూరియా వాడుతూ తమ అనుభవాలను ఇతర రైతులు, అధికారులతో పంచుకున్న రైతులను అభినందించారు. గ్రామస్థాయిలో యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలనీ, నానో యూరియాను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ ద్వారా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన యూరియా మోతాదును రైతులు సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, నానో యూరియా, నానో డీఏపీ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ప్రజా పాలనలో భాగంగా మే నాలుగో తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -