– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వరావుపేట
బోధన అభ్యాసన సామగ్రితో విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయులు కు బోధనా సాధనాలు ఉంటాయని ఎంఈఓ ప్రసాదరావు అన్నారు. మండల స్థాయి టీఎల్ఎం మేళా స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణితం కోసం నమూనాలు, నంబర్ చార్ట్ లు, విజ్ఞానశాస్త్రం కోసం నమూనాలు,ప్రాజెక్టులు, భాషలను నేర్చుకోవడానికి చిత్రాలు,పటాలలు ప్రాముఖ్యత ను సంతరించుకుంటాయి అన్నారు.
సులభంగా అర్థం చేసుకోవడం, సంక్లిష్ట భావనలను సులభతరం చేసుకోవడానికి సహాయపడతాయి అన్నారు. ఆసక్తికరంగా బోధించడం, బోధనను ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా చేస్తాయి అన్నారు.విద్యార్థుల ఏకాగ్రతను పెంచుతాయి అని, సృజనాత్మకతను పెంపొందించు తాయని, విద్యార్థులు తమ సొంత బోధనా సాధనాలను తయారు చేయడం ద్వారా వారి సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రోత్సహిస్తాయి అన్నారు. మెరుగైన అభ్యాసాన్ని దృశ్యమానం చేసి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి అన్నారు.సంక్షిప్తంగా, టిఎల్ఎం లు బోధనా ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి, విద్యార్థుల సమగ్ర అభ్యాసనకు తోడ్పడతాయి అన్నారు.
ఈ మేళాలో మండలంలోని 58 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొత్తం 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ మేళాలో ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగు పరచు కోవడానికి అవసరమైన సూచనలను అశ్వారావుపేట బాలల, బాలికోన్నత, నారాయణపురం, గుమ్మడి వల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హరిత, కొండలరావు, వీరేశ్వరరావు, సత్యనారాయణలు అందించారు. మండల స్థాయిలో జరిగిన ఈ మేళాలో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు విభాగంలో ఎంపీయూపీఎస్ నారం వారి గూడెం,తిరుమల కుంట, ఆంగ్ల విభాగంలో ఎంపీయూపీఎస్ నారం వారి గూడెం,ఎంపీపీ ఎస్ మద్ది కొండ, గణితంలో ఎంపీపీ ఎస్ వడ్డి రంగాపురం, గాండ్లగూడెం, ఈవీఎస్ లో ఎంపీయూపీఎస్ ఆసుపాక, ఎంపీపీ ఎస్ పండు వారి గూడెం పాఠశాలలు జిల్లా స్థాయి మేళా కు ఎంపిక అయ్యాయి.