– హైటెక్స్‌లోమూడు రోజుల పాటు ఏర్పాటు
– హైదరాబాద్ చుట్టూ రియాల్టీ సమాన వృద్ధి
– నివాస కొనుగోళ్లకు సరైన సమయం:అధ్యక్షుడు జైదీప్ రెడ్డి వెల్లడి
– ప్రదర్శన బ్రోచర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడారు) హైదరాబాద్ చాప్టర్ నగరంలో మెగా ప్రాపర్టీ షో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి క్రెడారు హైదరాబాద్ ప్రాపర్టీ షో-2025ను హైటెక్స్‌లోని హాల్1, 3లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రెడారు హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండ్ల కొనుగోళ్లకు ఇది సరైన సమయం అన్నారు. హైదరాబాద్ నగరం కేవలం పశ్చిమ ప్రాంతంలోనే డిమాండ్ ఉందనేది ఒక అపోహ మాత్రమేనన్నారు. నగరం చుట్టు పక్కాల రియాల్టీ అభివృద్ధి చెందుతుందన్నారు. దక్షిణ, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలోని నిర్మాణాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. అయితే పశ్చిమ ప్రాంతంలోని నిర్మాణాలకు సంబంధించిన ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ఆ ఏరియాను హైలెట్ చేస్తున్నాయన్నారు. ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా మౌలిక వసతులను అందుబాటులోకి తెస్తుందన్నారు. రియాల్టీకి ప్రధానంగా మౌలిక వసతులే ప్రధాన మద్దతును అందిస్తాయన్నారు. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని తగ్గించడం ద్వారా నిర్మాణ రంగం వేగాన్ని పెంచడంతో పాటుగా నగదు ప్రవాహాన్ని పెంచవచ్చన్నారు. క్రెడారు హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి జగన్నాథ్ రావు మాట్లాడుతూ.. నగరం అన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించిన వేళ ఇప్పుడు నివాసాల కొనుగోలుకు అత్యుత్తమ సమయమన్నారు.
ప్రదర్శనకు 300 పైగా ప్రాజెక్టులు : కుర్ర శ్రీనాథ్
హైటెక్స్‌లో ఆగస్టు 15, 16, 17 తేదిల్లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేయనున్న ప్రాపర్టీ షోను ఇంతక్రితంతో పోల్చితే మరింత ఆకర్షణీయంగా నిర్వహించనున్నట్లు క్రెడారు కన్వీనర్ కుర్ర శ్రీనాథ్ అన్నారు. ఇక్కడ 70 ప్రముఖ సంస్థలు తమ 300 పైగా ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచనున్నాయన్నారు. చౌక ధర ప్లాట్ల నుంచి హైరైజ్ బిల్డింగ్‌లు, విల్లాలను ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. ప్రాపర్టీ షోలో ఈ దఫా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబాల కోసం ప్రత్యక్ష కళా ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన సంగీత ప్రదర్శనలు, నిపుణుల సెషన్లు, ఫుడ్ స్టాళ్లు తదితర వాటిలో సరదాగా గడపవచ్చన్నారు. హైదరాబాద్ వేగంగా పెరుగుతున్న నగరం మాత్రమే కాదని.. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీతో సమపాళ్లలో అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ నగరమని తెలిపారు. ప్రతీ వారాంతంలో కొత్త నివాసాల కోసం వెతికే బదులు క్రెడారు ప్రాపర్టీలో సులభంగా ఎంపిక చేసుకోవచ్చని సూచించారు.
ఈ సమావేశంలో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి కె కాంతి కిరణ్ రెడ్డి, సహ కన్వీనర్ అరవింద్ రావు మెచినేని, కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ అగర్వాల్, కె. అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వైౖ. రవి ప్రసాద్, ట్రెజరర్ నితీష్ రెడ్డి గుడూరు, జాయింట్ సెక్రెటరీలు సంజరు కుమార్ బన్సాల్, శ్రీరామ్ ముసునూరు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టులో క్రెడారు ప్రాపర్టీ షో
- Advertisement -
- Advertisement -