Wednesday, December 24, 2025
E-PAPER
Homeబీజినెస్భారీగా తగ్గిన క్రెడిట్‌ కార్డుల జారీ

భారీగా తగ్గిన క్రెడిట్‌ కార్డుల జారీ

- Advertisement -

జెఎం ఫైనాన్షి యల్‌ రిపోర్ట్‌
న్యూఢిల్లీ :
భారత్‌లో క్రెడిట్‌ కార్డుల జారీ భారీగా తగ్గిపోయిందని జెఎం ఫైనాన్సీయల్‌ ఇన్స్‌ట్యూషనల్‌ సెక్యూరిటీస్‌ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ 44 లక్షలకు పరిమితమయ్యాయని వెల్లడిం చింది. గతేడాది ఇదే నెలలో 61 లక్షల కొత్త కార్డుల జారీతో పోల్చితే 28 శాతం పతనం చోటు చేసుకుందని తెలిపింది. జెఎం ఫైనాన్సీయల్‌ ఇన్స్‌ట్యూషనల్‌ సెక్యూరిటీస్‌ రిపోర్ట్‌ ప్రకారం.. క్రెడిట్‌ కార్డుల పరిశ్రమ వృద్ధిలో స్పష్టమైన మందగమనం చోటు చేసుకుంది. ప్రయివేటు రంగ బ్యాంకులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తు న్నప్పటికీ కొత్త కార్డుల జారీ భారీగా తగ్గింది. చలామణిలో ఉన్న మొత్తం కార్డుల పెరుగుదల కేవలం 6 శాతం వద్దే నిలిచిపోయింది. ఇది వినియోగదారుల రుణ విస్తరణలో కనిపిస్తున్న తీవ్ర మందగమనాన్ని సూచిస్తోంది.

బకాయిల్లో మందగమనం..
కొత్త కార్డుల జారీ తగ్గడం వల్ల క్రెడిట్‌ కార్డ్‌ నిల్వలు కూడా ప్రభావితమయ్యాయి. 2024-25లో రుణ అవుట్‌స్టాండింగ్‌లో 20 శాతం వృద్ధి చోటు చేసుకోగా.. 2025-26 సెప్టెంబర్‌ త్రైమాసికంలో 9 శాతానికి పడిపోయింది. ఈ త్రైమాసికంలో జారీ అయిన కొత్త కార్డులలో దాదాపు 78 శాతం ప్రయివేటు రంగ బ్యాంకుల నుండే నమోదయ్యాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ఎస్‌బిఐ కార్డ్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వరుసగా 172 బేసిస్‌ పాయింట్లు, 96 బేసిస్‌ పాయింట్ల చొప్పున తమ మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ వాటాలు తగ్గాయి. నవంబర్‌ ముగింపు నాటికి దేశంలో 11.3 కోట్ల క్రెడిట్‌ కార్డులున్నాయని అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దాదాపు 22 శాతం, ఎస్‌బీఐ కార్డ్స్‌ 19 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 14 శాతం చొప్పున మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.

పీిఎస్‌బీలు మెరుగు..
వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, ఆటో లోన్ల వంటి కీలక రిటైల్‌ విభాగాల్లో ప్రయివేటు రంగ బ్యాంక్‌ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్‌ వాటాను క్రమంగా చేజిక్కించుకుంటు న్నాయని జెఎం ఫైనాన్సీయల్‌ తెలిపింది. మెరుగైన ఆస్తి నాణ్యత, పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం, రుణ వృద్ధిలో రికవరీ కారణంగా అన్‌సెక్యూర్డ్‌, సెక్యూర్డ్‌ రుణ విభాగాల్లో ప్రభుత్వ బ్యాంకులు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -