- Advertisement -
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని పీఎం కుసుమ్ పథకం కింద రూ.320 కోట్ల విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు సీఆర్‌ఐ పంప్స్‌కు చెందిన సీఆర్‌ఐ సోలార్ వెల్లడించింది. ఇందులో భాగంగా 10,714 ఆఫ్‌గ్రిడ్ డిసి సోలార్ ఫోటోవోల్టాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ (3 హెచ్‌పి, 5 హెచ్‌పి, 7.5 హెచ్‌పి) ఆర్డర్‌ను పొందినట్టు పేర్కొంది. ఈ సిస్టమ్స్‌లో ఐఓటీ రిమోట్ మానిటరింగ్ సిస్టమ్, 5 ఏండ్ల వారంటీతో అందించనున్నామని ఆ కంపెనీ ప్రతినిధి జి సౌందరరాజన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌలభ్యం, నీటిపారుదలఉ పెంచి, వ్యవసాయ ఉత్పాదకతను బలోపేతం చేస్తుందన్నారు.
- Advertisement -