- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలోని భూతాయి కే గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు యువ జన సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ పోటీలను స్థానిక సర్పంచ్ మాడావి సింధు చేతిలో మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆటలు యువతలో మంచి క్రమశిక్షణను ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. యువత క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాడవి జైతు, తుడసం వినాయక రావు, బీమ్ రావ్, మారుతి, సంతోష్, విశ్వనాథ్, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



