- Advertisement -
– సర్పంచ్ సుద్దాల లింగం
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని పోసానిపేటలో స్వామి వివేకానంద జయంతిని పునస్కరించుకొని ప్రీమియర్ లీగ్-3 క్రికెట్ మ్యాచ్ ను గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉప సర్పంచ్ గాండ్ర ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించడం శుభ సూచకమని, గెలుపోటములు సహజమేనని, ఆటల పోటీలతో సంబంధాలు బలపడతాయని, స్నేహబంధంతో క్రీడలు నిర్వహించుకోవడం మంచి సాంప్రదాయమని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డీ మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



