బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం
ఢాకా (బంగ్లాదేశ్) : దేశవాళీ క్రికెట్‌లో మహిళలు ఓ వన్డే మ్యాచ్ ఆడితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అందించే మ్యాచ్ ఫీజు రూ.750 (వెయ్యి బంగ్లా టాకాలు). బీసీబీ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తమీమ్ ఇక్బాల్ ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు మూలం క్రికెటర్లు. సముచిత మ్యాచ్ ఫీజులు బోర్డు కనీస బాధ్యతగా భావిస్తూ.. తమీమ్ ఇక్బాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు టీ20లకు (టాకాల్లో) 10 వేలు, వన్డేలకు 15 వేలు, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు 20 వేలు ఫీజుగా అందుకోనున్నారు. దేశవాళీ క్రికెట్‌లో 36 మంది మహిళా క్రికెటర్ల వేతనాలను 30 వేల నుంచి 40 వేలకు పెంపుదల చేశారు. దేశవాళీ మెన్స్ క్రికెటర్ల వేతనాలను సైతం బీసీబీ సవరించింది. కేటగిరీ-ఏ క్రికెటర్లు నెలకు 65 వేలు, కేటగిరీ-బి క్రికెటర్లు 50 వేలు, కేటగిరీ-సి క్రికెటర్లు 40 వేలు వేతనంగా తీసుకోనున్నారు. ఫస్ల్ క్లాస్ మ్యాచ్ ఫీజును 70 వేల నుంచి 1 లక్షకు పెంచారు. ‘గత 3-4 ఏండ్లుగా క్రికెటర్ల వేతనాలను స్వల్పంగా పెంచారు. గత వేతన పద్దతిలో క్రికెటర్లకు ఎంతో తక్కువ జీతాలు ఇచ్చారు. క్రికెటర్లు ఎంతో కష్టపడతారు, వాళ్ల శ్రమతోనే క్రికెట్ నిలబడింది. మెరుగైన వేతనాలకు క్రికెటర్లు అర్హులు’ అని తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. 2026 జనవరి 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
క్రికెటర్ల వేతనాలు పెంపు
- Advertisement -
- Advertisement -



