Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంనేరాలు పెరుగుతున్నాయి

నేరాలు పెరుగుతున్నాయి

- Advertisement -

ఎందుకో విశ్లేషించండి
శాంతిభద్రతల సమీక్షలో సిఎం చంద్రబాబు
భూ వివాదాల్లో రాజకీయ ప్రమేయం: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

అమరావతి: రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా చివరి రోజైన గురువారం శాంతిభద్రతల అంశంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో నేరాల రేటు ఎక్కువగా ఉందని, మరికొన్ని చోట్ల తక్కువగా ఉందన్నారు. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ నేరాలు ఎందుకు పెరిగాయో విశ్లేషించాలని ఆదేశించారు. కడప, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఆస్తుల సంబంధిత కేసులు ఎక్కువగా ఉన్నాయని, దీనికి కారణం ఏమిటో విశ్లేషించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 5.5శాతం మేర నేరాల రేటు తగ్గినా, జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందన్నారు.విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. విశాఖ జోన్‌లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని చెప్పారు.

భూ వివాదాల్లో రాజకీయ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించొద్దని జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను చంద్రబాబు ఆదేశించారు.విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని చెప్పారు. ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. 22ఎ భూములను అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టించే వారిపై పిడి యాక్ట్‌ పెట్టాలని ఆదేశించారు. అసంబద్దంగా చలానాలు వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేరుమోసిన(నోటోరియస్‌) రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆదేశించారు. సోషల్‌ మీడియాలో జరిగే ఫేక్‌ ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో పాటు పోలీసులు, నిపుణులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. తీరభద్రతకు తక్షణం బోట్టు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ సారి జరగనున్న కలెక్టర్ల సదస్సు నాటికి జిల్లాలోని టాప్‌-3 నేరాలను ఏ విధంగా కట్టడి చేశారనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని చెప్పారు. నేరాల శాతం తగ్గి శిక్షల శాతం పెరగాలని చెప్పారు.

నిర్లిప్తంగా ఉండటం సరికాదు: పవన్‌ కళ్యాణ్‌
నేరాల పట్ల నిర్లిప్తంగా ఉండటం సరికాదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విశాఖపట్నంలో కొందరు ఆకస్మికంగా చేసిన దాడిని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. అధికారంలోకి ఉండి కూడా ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నామని అన్నారు. రాష్ట్రం 15శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని చెప్పారు.. మతం పేరుతో విపరీతమైన సౌండ్‌ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్ధనలు చేయడం తప్పని తెలిపారు. ఎక్కడైనా చట్టం, సుప్రీకోర్టు ఆదేశం మాత్రమే ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన డెసిబుల్స్‌లోనే సౌండ్‌ ఉండాలని, ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పారు.

5.5శాతం తగ్గిన క్రైమ్‌ రేటు:డిజిపి
రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాల్లో 5.5శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. 2023 డిసెంబర్‌ నుంచి 2024 నవంబర్‌ వరకు 1,10,111 నేరాలు నమోదైతే డిసెంబర్‌ 2024 నుంచి 2025 నవంబర్‌ మధ్య కాలంలో 1,04,095 నేరాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రధానంగా 16 జిల్లాల్లో నేరాలు చాలా తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. గొడవలు, అల్లర్లు వంటి సంఘటనలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఎస్సి,ఎస్టిలపైన నేరాలు గతేడాదితో పోల్చితే 22.35శాతం తగ్గాయని పేర్కొన్నారు.

చంద్రబాబుకు బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఎకనామిక్‌ టైమ్స్‌ నురచి బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభిరచిరది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు సీకరిరచినప్పటి నురచి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ అవార్డు లభిరచినట్లు ఈ అవార్డు అరదిస్తున్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రకటిరచిరది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధిరచడం, అరదుకోసం 25 పాలసీలు ప్రకటిరచడం, వాటిని సక్రమంగా అమలు చేసేరదుకు తీసుకురటున్న చర్యల నేపథ్యంలో అనేక మంది ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును చంద్రబాబుకు ఇవ్వాలని నిర్ణయిరచినట్లు పేర్కొంది. గురువారం ఈ అరశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ల సదస్సులో ప్రస్తావిరచారు. దీరతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా కరతాళధ్వనులతో ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పరదిస్తూ ఈ అవార్డుకు కారణం తన సహచరులు, అధికారుల సహకారమేనని వ్యాఖ్యానిరచారు. గతంలో అనేక విదేశీ విశ్వవిద్యాలయాల నురచి డాక్టరేట్‌ ఇస్తామన్నా తిరస్కరిరచానని, కేవలం విధుల నిర్వహణపైనే దృష్టి పెడుతున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -