సోషల్ మీడియా టేక్‌డౌన్ ఆర్డర్లు ‘రాజకీయ ప్రేరేపిత’మని వెల్లడి
డిజిటల్ వాణిజ్యానికి అడ్డంకిగా మారుతున్నాయని ఆందోళన
న్యూఢిల్లీ : అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన తాజా ట్రేడ్ నివేదికలో భారత ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు ఇచ్చే టేక్‌డౌన్ ఆదేశాలు ‘రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నాయి’ అని పేర్కొంది. ఈ చర్యలు డిజిటల్ వాణిజ్యానికి అడ్డంకులుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాళ్లోకెళ్తే… అమెరికా ట్రేడ్ ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్).. 2026 నేషనల్ ట్రేడ్ ఎస్టిమేట్ నివేదికను డోనాల్డ్ ట్రంప్ ప్రభు త్వం, కాంగ్రెస్‌కు సమర్పించింది. ఈ నివేదికలో భారత్‌లోని కొన్ని విధానాలను ‘నాన్-టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్’గా పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2021లో అమలులోకి వచ్చిన ఐటీ నియమాల తర్వాత అమెరికన్ సోషల్ మీడియా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో టేక్‌డౌన్ అభ్యర్థనలు అందుకుం టున్నాయి. వీటిలో చాలా ‘రాజకీయ కారణాలతో’ జారీ అవుతున్నాయని అమెరికా అభిప్రాయ పడింది. ఈ ఆదేశాలు వార్తా సంస్థలు, కమెడి యన్లు, కార్టూనిస్టులు, రాజకీయ వ్యాఖ్యాతలపై ప్రభావం చూపుతున్నాయి. భారత ప్రభుత్వం ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఏ వంటి నిబంధనల ఆధారంగా ఈ చర్యలు తీసు కుంటోంది. జాతీయ భద్రత, ప్రజాశాంతి వంటి కారణాలను చూపిస్తూ కంటెంట్ బ్లాక్ చేయడం జరుగుతోంది. ఇటీవల కంటెంట్ తొలగించడానికి ఇచ్చే గడువు 36 గంటల నుంచి కేవలం 3 గంటలకు తగ్గించడం కూడా గమనార్హం.
భారత్‌లో తరచుగా జరిగే ఇంటర్నెట్ నిలిపివేతలను కూడా నివేదిక ప్రస్తావించింది. ఇవి సమాచార ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా.. వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ప్రజాభద్రత, జాతీ య భద్రత కారణాల పేరుతో ప్రభుత్వాలు ఈ చర్య లు తీసుకుంటున్నాయని వివరించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) నియమాలు కూడా అమెరికా కంపెనీలకు భారంగా మారవ చ్చని నివేదిక పేర్కొంది. ఈ చట్టాలు వ్యక్తిగత డేటాను ప్రభుత్వానికి వెల్లడించే పరిస్థితులను కల్పిస్తాయి. విదేశాలకు డేటా పంపిణీపై పరిమితులు విధిస్తాయి. క్రెడిట్ సమాచార సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతాయి.
కాగా అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాల్లో కూడా ఈ గణాంకాలు కీలకంగా మారాయని విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించిన విషయం విదితమే. అయితే తర్వాత అమెరికా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజా నివేదిక అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమెరికా నివేదికలో భారత ప్రభుత్వంపై విమర్శలు
- Advertisement -
- Advertisement -



